Maye Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తల్లి మయే మస్క్ (Maye Musk) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)తో కలిసి ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Two powerful women, one peaceful prayer.#JacquelineFernandez and #MayeMusk visited Siddhivinayak temple in the city recently. #Celebs pic.twitter.com/UTo0dUHGGB
— Filmfare (@filmfare) April 21, 2025
మరోవైపు మయే మస్క్ తన 77వ పుట్టినరోజును భారత్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఘనంగా పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీకి 40 నుంచి 50 మంది హాజరైనట్లు ముంబై మీడియా తెలిపింది. ఇక తన బర్త్డే సందర్భంగా మయే మస్క్ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రస్తుతం భారత్లో ఉన్న తల్లికి టెక్ టైకూన్ మస్క్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపారు. అందమైన పూలను తన తల్లికి బర్త్డే కానుకగా అందించారు. ఈ విషయాన్ని మయే మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Thank you @elonmusk for sending these beautiful birthday flowers to me in Mumbai 🇮🇳 Love m ❤️❤️#ItsGreatToBe77 🎂🎉 pic.twitter.com/9Fc3hwdKix
— Maye Musk (@mayemusk) April 20, 2025
Also Read..
CV Ananda Bose | పశ్చిమబెంగాల్ గవర్నర్కు ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు
PM Modi | భారతీయుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.. పోప్ మృతికి ప్రధాని సంతాపం
JD Vance | భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు.. వీడియో వైరల్