CV Ananda Bose : పశ్చిమబెంగాల్ (West Begal) గవర్నర్ (Governor) సీవీ ఆనందబోస్ (CV Anandabose) ఛాతీలో నొప్పితో ఆస్పత్రి పాలయ్యారు. సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను హుటాహుటిన కోల్‌కతా (Kolkata) లోని కమాండ్ ఆస్పత్రి (Command hospital) కి తరలించారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. గవర్నర్‌కు ప్రాథమిక పరీక్షలు చేశామని, ఆయన గుండెలో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించామని కమాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆస్పత్రికి వెళ్లి గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌ను కలిసి ఆస్పత్రి బయటికి వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పుడే గవర్నర్‌ను చూసి వచ్చానని, ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఆదేశించానని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను కమాండ్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
అయితే గవర్నర్‌కు అస్వస్థతపై రాజ్‌భవన్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే గవర్నర్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉన్నదని రాజ్‌భవన్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా గవర్నర్ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.