Jitendra Singh | జమ్ముకశ్మీర్ ప్రజలు తమకు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేయడంతో సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావాలని కశ్మీరీలు కోరుకుంటున్నారన్నారు. శనివారం శ్రీనగర్లో ఆయన సీఎస్ఐఆర్ హెల్త్ కేర్ థీమ్ కాంక్లేవ్ ప్రారంభం తర్వాత మీడియాతో మాట్లాడుతూ భారత దేశ వృద్ధి గాధలో జమ్ముకశ్మీర్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో తీసుకొస్తున్న మార్పుల పట్ల సామాన్యులు సంతృప్తి చెందుతున్నారని, సంతోషంగా ఉన్నారన్నారు.
370 అధికరణంపై జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అధికార మిత్ర పక్షాల మధ్య విభేదాలతో చర్చ జరుగుతున్నదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించమని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కోరాయే తప్ప, 370 అధికరణం పునరుద్ధరణ గురించి కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కల్పించిన ఉపాధి అవకాశాలను వదులుకునేందుకు కశ్మీరీ యువత సిద్ధంగా లేరన్నారు.