బుధవారం 20 జనవరి 2021
National - Dec 29, 2020 , 15:29:58

ర‌జ‌నీ నిర్ణ‌యంపై ఆయ‌న అన్న ఏమ‌న్నారో తెలుసా?

ర‌జ‌నీ నిర్ణ‌యంపై ఆయ‌న అన్న ఏమ‌న్నారో తెలుసా?

చెన్నై:  ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ తాను పార్టీ పెట్ట‌డం లేద‌ని ర‌జ‌నీకాంత్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే క‌దా. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కార‌ణంగా చూపిస్తూ.. ఇది దేవుడు త‌న‌కు ఇచ్చిన వార్నింగ్ అని ఆయ‌న త‌న లేఖ‌లో అన్నారు. దీనిపై ర‌జనీ అన్న స‌త్య‌నారాయ‌ణ రావు స్పందించారు. పార్టీ పెట్ట‌క‌పోవ‌డం ఆయ‌న ఇష్టం అని, మ‌న‌సు మార్చుకోవాల్సిందిగా ఎవ‌రూ ఆయ‌న‌పై ఒత్తిడి తేలేమ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు ఆయన‌పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు క‌దా అని ప్ర‌శ్నించ‌గా.. తాము కూడా ఆయ‌న పార్టీ పెడ‌తార‌ని ఆశించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ర‌జ‌నీకాంత్ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కార‌ణంగా చూపించారు. అందుకే మ‌నం మ‌న‌సు మార్చుకోమ‌ని ఒత్తిడి చేయ‌లేము. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా అది స‌రైన‌దే అని స‌త్యనారాయ‌ణ రావు అభిప్రాయ‌ప‌డ్డారు. తాను సోమ‌వార‌మే ర‌జ‌నీతో మాట్లాడి, ఆరోగ్యంపై ఆరా తీసిన‌ట్లు చెప్పారు. గ‌త నెల‌లోనే ర‌జ‌నీ కూడా బెంగ‌ళూరులో ఉన్న త‌న అన్న ద‌గ్గ‌రికి వెళ్లి వ‌చ్చారు. ఇక్క‌డే జ‌న్మించిన ర‌జ‌నీ.. 22 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు బెంగ‌ళూరులోనే ఉన్నాడు. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడుకు వెళ్లి సూప‌ర్ స్టార్ అయ్యాడు. ర‌జ‌నీ ఇచ్చిన మాట నిలెబ‌ట్టుకుంటాడ‌ని, ఆయ‌న చెప్పింది చేస్తాడ‌ని ఈ సంద‌ర్భంగా స‌త్య‌నారాయ‌ణ రావు అన్నారు.


logo