ISRO | న్యూఢిల్లీ, డిసెంబర్ 22: విత్తనాలు మొలకెత్తటం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ‘ఇస్రో’ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది. క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి (మొలకెత్తటం), రెండు ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం 8 అలసంద విత్తనాల్ని అంతరిక్షంలో పెంచాలని ఇస్రో భావిస్తున్నది. ఇదే కాకుండా ఇస్రో, ప్రైవేట్ వర్సిటీలు, స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం 24 ప్రయోగాలను ‘పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పర్మెంట్ మాడ్యూల్’ (పోయెం) ద్వారా చేపట్టబోతున్నారు.
ఇందుకోసం ఈ నెలాఖరున ‘పీఎస్ఎల్వీ-సీ60’ మిషన్ ద్వారా భూ కక్ష్యలోకి రెండు శాటిలైట్లను ఇస్రో ప్రవేశపెట్టబోతున్నది. చేజర్, టార్గెట్.. అనే ఈ శాటిలైట్స్‌ను భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో కీలక భూమిక వహించనున్నాయి. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన ‘స్పేస్ డాకింగ్ టెక్నాలజీ’ని పరీక్షించనున్నారు. విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు ‘క్రాప్స్’ అనే వ్యవస్థను రూపొందించారు.
ప్రపంచ ధ్యాన దినోత్సవంలో భాగంగా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యక్ష ధ్యాన కార్యక్రమం ప్రపంచ రికార్డులను తిరగరాసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ , ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , వరల్డ్ రికార్డ్ యూనియన్‌లో స్థానం దక్కించుకుంది. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ గైడెడ్ ధ్యాన కార్యక్రమానికి అత్యధిక వ్యూస్ లభించినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. భారతలోని అన్ని రాష్ర్టాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సును సాధించింది.