బెంగళూరు: ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయోత్సాహంలో మునిగితేలుతున్న భారతీయులకు ఇస్రో మరో శుభవార్త చెప్పింది. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంత ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల వరకు సక్సెస్‌ఫుల్‌గా తిరిగిందని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ 100 మీ. తిరిగినట్టు తెలిపింది. రోవర్ తిరిగిన రూట్‌మ్యాప్‌ను శనివారం ఇస్రో ఎక్స్‌లో షేర్ చేసింది.
స్లీప్ మోడ్‌లోకి రోవర్…
మరోవైపు జాబిల్లి ఉపరితలంపై పగలు మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో ఇస్రో రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపించింది. ఇందులోని ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ రెండు పేలోడ్లు పనులను నిలిపివేసింది. ‘మరో రెండు రోజుల్లో జాబిల్లిపై రాత్రి అవుతుంది. ఆ సమయంలో ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపించాం. ఈనెల 22న తిరిగి పగలు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రోవర్ బ్యాటరీ ఫుల్ చార్జింగ్‌లో ఉంది’ అని ఇస్రో తెలిపింది.