శనివారం 11 జూలై 2020
National - Jun 24, 2020 , 03:35:22

యూపీలో యువకుడిపై మూకదాడి, హత్య!

యూపీలో యువకుడిపై మూకదాడి, హత్య!

లక్నో: ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడన్న కారణంగా ఇస్రార్‌ అనే వ్యక్తిపై కొందరు మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడం వల్ల బాధితుడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో గత గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టాయి. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు ఇస్రార్‌కు మానసికస్థితి బాగాలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఇస్రార్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడిచేసి హత్యచేశారని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.


logo