Israel | భూకంపాన్ని సృష్టించిన ఇజ్రాయెల్.. హెజ్బొల్లా టన్నెల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 4.1 తీవ్రతతో భూకంపం
Israel : నేటి టెక్నాలజీ యుగంలో బాంబు దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పేందుకు ఈ దాడి ఒక ఉదాహరణ. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. ఏకంగా భారీ భూంకపాన్ని సృష్టించింది.
Israel : నేటి టెక్నాలజీ యుగంలో బాంబు దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పేందుకు ఈ దాడి ఒక ఉదాహరణ. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. ఏకంగా భారీ భూంకపాన్ని సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని లెబనాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది.
లెబనాన్‌లో హెజ్బొల్లా ఉగ్ర సంస్థకు చెందిన స్థావరాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా అలి అల్ తాహెర్ రిడ్జ్ ప్రాంతంలోని హెజ్బొల్లాకు చెందిన ఒక టన్నెల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ భారీ దాడితో ఆ టన్నెల్ కూలిపోయింది. ఇదే సమయంలో బాంబు తీవ్రత కారణంగా చుట్టుపక్కల ప్రకంపనలు వచ్చాయి. దీని కారణంగా స్థానికంగా భూకంపం నమోదైంది. ఈ భూకంపం తీవ్రత 4.1గా ఉన్నట్లు అమెరికా సంస్థ తెలిపింది.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Southern Lebanon experienced a magnitude-4.1 earthquake triggered by Israeli explosives detonated at the Ali Taher ridge, the US Geological Survey confirmed. <a href=”https://t.co/wbBjIlGkNU”>pic.twitter.com/wbBjIlGkNU</a></p>— HatsOff (@HatsOffff) <a href=”https://x.com/HatsOffff/status/2098360905708843075?ref_src=twsrc%5Etfw”>September 11, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>
దక్షిణ లెబనాన్‌లోని నబాతే సహా అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు వెల్లడించింది. లెబనాన్‌పై జరిపిన ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జు కూడా అంగీకరించారు. దశాబ్దాల క్రితం ఇరాన్ నిధులతో నిర్మించిన తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు వారు ప్రకటించారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

