Hongqi N701 : బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Jinping) భారత్‌కు విచ్చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు వస్తున్న ఆయన వ్యక్తిగత భద్రతకు పక్కాగా ఏర్పాట్లు చేసింది చైనా. ఈ ద్వైపాక్షిక పర్యటనలో జిన్‌పింగ్ తన అధికారిక వాహనం ‘లిమో'(Limo)ను ఉపయోగించనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారు బాంబు దాడులను, తుపాకీ కాల్పులను తట్టుకోగలదు. ఈమధ్య కాలంలో విదేశాలకు వెళ్లినప్పుడు జిన్‌పింగ్ భద్రత బృందం ఈ కారును సైతం వెంట తీసుకెళ్తోంది. తమ దేశాధినేత ప్రాణాలకు రక్షణ కోటలా నిలిచే ఈ కారులో చాలా ప్రత్యేకతలున్నాయి.
భారత్ వేదికగా పద్దెనిమిదో బ్రిక్స్ సమావేశాలు రేపటితో ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో జరుగనున్న ఈ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొనడం ఖరారు కావడంతో ఆయన భద్రతకు పకడ్బందీగా చర్యలు చేపట్టారు అధికారులు. ద్వైపాక్షికంగా ఇరుదేశాలకు కీలకమైన ఈ సదస్సుకు విచ్చేస్తున్న జిన్‌పింగ్ ఇక్కడ తన అధికారిక వాహనం హోంగ్కీ ఎన్701లోనే ప్రయాణించనున్నారు. ఆనవాయితీ ప్రకారం విదేశీ పర్యటనల్లో భద్రతలో భాగంగా ఈ కారును ఆయన ఉపయోగించనున్నారు. ఈమధ్య ఈజిప్ట్, యూఎస్ఏ, రష్యా, హాంకాంగ్ వెళ్లినప్పుడు కూడా దీన్ని వెంట తీసుకెళ్లారు జిన్‌పింగ్.
Xi Jinping’s Heavily Armoured Limo Is Coming To Delhi For BRICS: All About Ithttps://t.co/n1tltBs5TK@ndtv report:
— NDTV AutoMate (@NDTVAutoMate) September 11, 2026
హోంగ్కీ ఎన్701 కారు దాదాపు 5.5 మీటర్ల లేదా 18 ఫీట్ల పొడవు ఉంటుంది. నిరుడు చైనా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ప్రయాణించిన హాంగ్కీ ఎల్5 లిమౌసిన్లోని ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. 21 ఇంచుల బుల్లెట్ ప్రూఫ్ చక్రాలు, టైర్లతో పాటు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఏర్పాటు చేశారు. ఇక లోపల కూడా ఆయుధాల దాడిని తట్టుకోగల పలకలు భద్రతలో కీలకం కానున్నాయి. చిన్నపాటి బాంబు పేలుళ్లను ఈ కారు తట్టుకోగలదు.
‘Aurus Senat’ से पहुंचे पुतिन, शी जिनपिंग की ‘Hongqi N701’ भी आ रही है दिल्ली, जानें इन कारों की खासियतhttps://t.co/smTFVG6oju
— India TV (@indiatvnews) September 11, 2026
అంతేకాదు ఇందులోని ఎయిర్ కంప్రెషన్ వ్యవస్థను రసాయనాల దాడిని కూడా తట్టుకునేలా రూపొందించారు. ఇంజిన్ సామర్థ్యం విషయానికొస్తే..6.0 లీటర్ వీ12 రకం. ఇది 408 హార్స్ పవర్‌ను విడుదల చేస్తుంది. ఇప్పటికే బ్రిక్స్ సమావేశాల కోసం ఢిల్లీలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం తన రక్షణ వాహనం అరుస్ సెనాట్‌ను వెంట తెచ్చుకున్న విషయం తెలిసిందే.