Ayodhya Ram Mandir | అయోధ్య ఉద్యోగ నియామకాల్లోనూ అక్రమాలు.. భారీగా లంచాలు స్వీకరణ
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై సిట్ జరుపుతున్న విచారణలో తవ్వే కొద్దీ పలు అక్రమాలు బయటపడుతున్నాయి.
- భారీగా లంచాలు స్వీకరణ
- సిఫార్సులతోనే 125 మందికి పైగా రిక్రూట్మెంట్
- కుంభమేళా సమయంలో ఎడాపెడా విరాళాల దోపిడీ
అయోధ్య, జూలై 1: అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై సిట్ జరుపుతున్న విచారణలో తవ్వే కొద్దీ పలు అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కుంభమేళా సమయంలో భారీగా విరాళాల చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. విరాళాల లెక్కింపులో కోట్ల కొద్దీ అక్రమాలు చోటుచేసుకున్న విషయాన్ని ఇప్పటికే సిట్ బయటకు తీసింది. ప్రస్తుతం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాలపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించింది. వీరిద్దరూ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య రామాలయంలో ఇష్టానుసారంగా జరిపిన ఉద్యోగ నియామకాల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు సిట్ గుర్తించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, సభ్యుల సిఫార్సు మేరకు పలువురిని అక్రమంగా నియమించినట్లు వెల్లడైంది. కేవలం అనిల్ మిశ్రా సిఫార్సుతోనే 125 మంది ఉద్యోగుల నియామకాలు జరిగాయి. చంపత్ రాయ్, గోపాల్రావుల సన్నిహితులు కూడా ఈ నియామక ప్రక్రియను ప్రభావితం చేశారు.
కుంభమేళా సమయంలోనే భారీగా దోచేశారు!
రామ మందిర విరాళాల కేసు దర్యాప్తులో అయోధ్య పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు. గత ఏడాది ఆరంభంలో జరిగిన కుంభమేళా సమయంలో అత్యధికంగా విరాళాల చోరీ జరిగినట్టు వారు వెల్లడించారు. ఆ సమయంలో ఆలయానికి పెద్దయెత్తున పోటెత్తిన భక్తులు భారీగా విరాళాలు సమర్పించారని, రద్దీని ఆసరాగా తీసుకుని ఆ సమయంలో భారీగా అపహరణకు పాల్పడ్డారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

