IRCTC Down | రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మెయింటెనెన్స్ (maintenance activity) కారణంగా సర్వర్ డౌన్ అయ్యింది (IRCTC Down). ఫలితంగా గురువారం ఉదయం కొన్ని గంటల పాటు ఐఆర్సీటీసీ సేవలు నిలిచిపోయాయి.
ఉదయం తత్కాల్ టికెట్స్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవ్వట్లేదని పలువురు యూజర్లు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేక పోతున్నామంటూ పేర్కొంటున్నారు. ఈ సమస్యపై ఐఆర్సీటీసీ స్పందించింది.
మెయింటెనెన్స్ కారణంగా ఈటికెట్ సేవలు అందుబాటులో లేవని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ రద్దు చేసుకోవడానికి, ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 08044647999, 08035734999కు ఫోన్ చేయాలని, లేదంటే etickets@irctc.co.inకి మెయిల్ చేయాలని సూచించింది.
కాగా, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండో సారి. రెండు వారాల క్రితం కూడా ఇదే సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా తత్కాల్ బుకింగ్ సమయంలోనే సమస్య తలెత్తింది. తరచూ ఇలాంటి సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహకానికి గురవుతున్నారు.
Also Read..
CM Revanth Reddy | సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ.. ఇండస్ట్రీకి ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే
Lamborghini | నడిరోడ్డుపై మంటల్లో చిక్కుకున్న రూ.కోట్లు ఖరీదైన లాంబోర్గినీ కారు.. వీడియో
Harish Rao | సీఎం రేవంత్.. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు: హరీశ్‌రావు