Rajdhani Express | రాజధాని రైలులో ప్రయాణికుడికి షాక్.. బిర్యానీలో ఈగ ప్రత్యక్షం!
Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ వచ్చిన ఘటనను ఐఆర్సీటీసీ సీరియస్‌గా తీసుకుంది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని షోకాజు నోటీసులు జారీ చేసింది.
Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ వచ్చిన ఘటనను ఐఆర్సీటీసీ సీరియస్‌గా తీసుకుంది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని షోకాజు నోటీసులు జారీ చేసింది.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ప్రయాణించిన ఓ వ్యక్తి ఆన్‌బోర్డు భోజనంగా వెజ్ బిర్యానీతో కూడిన కాంబో లంచ్‌ను ఆర్డర్ చేశాడు. దానిని తినే సమయంలో బిర్యానీలో ఈగ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రయాణికుడు వెంటనే రైలు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. భోజనం నాణ్యత కూడా బాగోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే రైలు కెప్టెన్, ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ మేనేజర్ ప్రయాణికుడి వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పి కొత్త భోజనం అందిస్తామని ప్రయాణికుడికి చెప్పారు. కానీ అందుకు ప్రయాణికుడు తిరస్కరించాడు. దీనిపై ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేయగా.. అరాహా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న సూరత్‌లోని లైసెన్స్ పొందిన బేస్ కిచెన్ నుంచి ఆ ఫుడ్ సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో భోజనం తయారీతో పాటు, ప్యాకేజింగ్ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నట్లు గమనించారు. ఈ నేపథ్యంలో సదరు క్యాటరింగ్ సంస్థకు ఐఆర్సీటీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

