ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. బల పరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బుధవారం సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫన్సాల్కర్‌ను ముంబై పోలీస్ కమిషనర్‌గా నియమించింది. వివేక్ ఫన్సాల్కర్ ముంబైకి చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నది. ప్రస్తుత ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త కమిషనర్‌ను నియమించింది. అలాగే అర్చనా త్యాగికి మహారాష్ట్ర స్టేట్ హౌసింగ్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.