Weather Alert : దేశంలో వానల గురించి ఐఎండీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 4 నుంచి 10 వరకు వివిధ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తోపాటు పలు ప్రాంతాల్లో ఈ వారం వర్షాలు కురుస్తాయి.
60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అయితే, గోవా, కొంకణ్ ప్రాంతాల్లో మాత్రం వేడి వాతావరణం, తేమ ఎక్కువగా ఉంటుంది. హరియాణా, యూపీ, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. బిహార్, ఝార్కండ్, ఒడిశాతోపాటు అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా ఈ వారం వర్షాలు పడుతాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 5 నుంచి 10 మధ్య వర్షం కురిసే అవకాశం ఉంది.
దక్షిణాదికి సంబంధించి ఏపీలోని రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 4-6 వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గోవాతోపాటు మధ్య మహారాష్ట్రప్రాంతాల్లో పొడి వాతావరణం ఎక్కువగా ఉండొచ్చు.