అమరావతి: ఏపీలోని టీడీపీ ప్రభుత్వ వేధింపులు, అవమానాలను తట్టుకోలేక ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ సర్వీసుకు గుడ్‌బై ప్రకటించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా ఉన్నారు.
అయితే చంద్రబాబు పదవిలోకి వచ్చినప్పటి నుంచి పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు ఆయనపై కూడా వేధింపులు ప్రారంభమయ్యాయని, ఈ క్రమంలోనే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసినట్టు తెలిసింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటున్నట్టు ప్రకటించాలంటూ ప్రభుత్వ పెద్దలు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.