చెన్నై: తమిళనాడులో దినేశ్ అనే ఓ భక్తుడికి ఊహించని అనుభవం ఎదురైంది. తిరుపోరూర్లోని కందస్వామి ఆలయంలో అతడి ఐఫోన్ అనుకోకుండా హుండీలోకి జారి పడింది.
ఖరీదైన తన ఫోన్ను తిరిగి ఇవ్వాలని అతడు కోరగా.. ‘నిబంధనల ప్రకారం అలా ఇవ్వలేం. ఆ ఫోన్ ఇక దేవుడి ఖాతాలోకి వెళ్లినట్టే!’ అని దేవాదాయ శాఖ శనివారం సమాధానమిచ్చింది. అందులోని డాటాను తీసుకోవచ్చని అతడికి సూచించింది.