న్యూ ఢిల్లీ: సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపబోతున్నది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మే 9న విచారణ జరుపనున్నది. 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు రివ్యూ పిటిషన్లో సవాల్ చేశారు.