Infosys | దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పని గంటలపై ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తాజాగా కీలక సూచన చేసింది. నిర్దేశిత పనివేళలు ముగిసిన తర్వాత అదనంగా పని చేయొద్దని (no overtime), ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉద్యోగులకు ఈమెయిల్స్ ద్వారా సూచిస్తోంది.
ఉద్యోగులు అదనపు పని గంటలు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నట్లు సంస్థ గుర్తించింది. ఈ మేరకు ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ కీలక సూచన చేసింది. ఇన్ఫోసిస్ ప్రస్తుతం హైబ్రిడ్ పద్ధతిని అవలంభిస్తోంది. దీని ప్రకారం ఇన్ఫీ ఉద్యోగులు నెలకు పది రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఉద్యోగులు వారంలో ఐదు రోజులు.. రోజుకు సగటున 9:15 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం పనిచేస్తున్న వారిని హెచ్ఆర్ విభాగం గుర్తించి వారికి వ్యక్తిగతంగా ఈమెయిల్స్ పంపుతోంది. ముఖ్యంగా రిమోట్‌గా పనిచేస్తున్న వారికి ఏ రోజు ఎన్ని గంటలు పనిచేసిందీ ఈమెయిల్లో పేర్కొంటోంది. పనివేళలు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని, పని మధ్యలో విరామం తప్పనిసరి అని ఆ మెయిల్స్‌లో సూచిస్తోంది. పని గంటల తర్వాత ఆఫీస్ పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తోంది. నారాయణమూర్తి వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై ఇన్ఫీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read..
Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. నలుగురు మృతి, 16 మంది గల్లంతు
Baba Ramdev | సహజంగానే మనిషి ఆయుర్దాయం 150 నుంచి 200 ఏళ్లు : బాబా రామ్‌దేవ్
Air India | అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం..