ఇండోర్: కొవిడ్-19కు సంబంధించిన సమాచారం కావాలంటూ ఆర్టీఐ దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి అధికారులు షాకిచ్చారు. ఇదిగో మీరు అడిగిన సమాచారం అంటూ 40 వేల పేజీలు అందజేసి తీసుకెళ్ల మన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా కొవిడ్ సమయంలో పలు అంశాల సమాచారం ఇవ్వాలంటూ దరఖాస్తు చేశారు. నెల లోపు సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలమవ్వడంతో మొదటి అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అతనికి ఆ సమాచారాన్ని ఉచితంగా అందజేయాలని ఆదేశించడంతో 40 వేల పేజీల సమాచారాన్ని ధర్మేంద్రకు అందించారు. ప్రభుత్వానికి రూ.80 వేల నష్టం చేకూర్చిన సిబ్బందిపై విచారణ జరిపి ఆ మొత్తం రికవరీ చేయాలని అప్పీలేట్ అధికారి ఆదేశించారు.