న్యూఢిల్లీ: ఇటీవల తమ విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ఏర్పడిన సంక్షోభం బారిన పడిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, ముఖ్యంగా డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రభావితులైన, ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు పరిహారం అందజేయనున్నట్టు ఇండిగో శుక్రవారం తెలిపింది.
బయలుదేరడానికి 24 గంటల ముందు విమానం రద్దయిన వారు, విమానాల రద్దు, ఆలస్యం కారణంగా విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన వారికి తాము రూ.500 కోట్లకు పైగా పరిహారాన్ని అందజేయాలని అంచనా వేశామని ఎక్స్‌లో పేర్కొంది.