IndiGo Plane | ట్యాక్సీవే మిస్ అయిన ఇండిగో విమానం.. కొంతసేపు రన్‌వే బ్లాక్
IndiGo Plane | ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్‌వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్‌వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్‌వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్‌వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. అమృత్సర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఇండిగో విమానం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే చల్లని వాతావరణం వల్ల ముందు ఉన్నవి సరిగా కనిపించకపోవడంతో ఎయిర్పోర్ట్ బే వైపు వెళ్లాల్సిన ట్యాక్సీవేలోకి ఆ విమానాన్ని పైలట్ తీసుకెళ్లలేదు. దీంతో ట్యాక్సీవే దాటిన ఆ విమానం రన్‌వే చివరి వరకు వెళ్లి ఆగింది.
కాగా, ఈ విషయాన్ని గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 15 నిమిషాలపాటు ఆ రన్‌వేను మూసివేశారు. ఒక వాహనం ద్వారా ఆ విమానాన్ని పార్కింగ్ బే వద్దకు తీసుకొచ్చారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఆ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ పరిస్థితి నెలకొన్నది. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

