పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి
Mukul Arya | పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్‌లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు.
న్యూఢిల్లీ: పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్‌లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు. ముకుల్ ఆర్య చనిపోయిన విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జయ్శంకర్ ధ్రువీకరించారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఆయన ఎలా చనిపోయారనే విషయంపై ఇంకా తెలియరాలేదు.
రమల్లాలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి జయశంకర్ అన్నారు. ముకుల్ ఎంతో తెలివైన, ప్రతిభావంతమైన అధికారిని చెప్పారు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి జయ్శంకర్ ట్వీట్ చేశారు.
ముకుల్ ఆర్య 2008 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివారు. కాబుల్, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

