దేశంలో 153కు చేరిన ఒమిక్రాన్ కేసులు
Omicron | కరోనా నూతన వేరియంట్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. మహమ్మారి సరికొత్త రూపం వేగంగా విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.

న్యూఢిల్లీ: కరోనా నూతన వేరియంట్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. మహమ్మారి సరికొత్త రూపం వేగంగా విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు చేరింది.
అధికారిక గణాంకాల ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్ 1, చండీగఢ్ 1, తమిళనాడు 1, పశ్చిమబెంగాల్లో 1 చొప్పున రికార్డయ్యాయి.
ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ ఎంతో స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నదని తెలిపింది. ఇప్పటికే 90కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేరొన్నది. వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gujrat
- India
- Maharashtra
- omicron
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

