గౌహతి: వందేభారత్ స్లీపర్ రైలు( Vande Bharat Sleeper Train)ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలును ఆయన స్టార్ట్ చేస్తారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలు బెంగాల్లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి వరకు వెళ్తుంది. రైల్వే శాఖ ఆ రైలుకు చెందిన ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో రిలీజ్ చేసింది.
అత్యాధునిక ఫీచర్లతో వందేభారత్ స్లీపర్ రైలును డిజైన్ చేశారు. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్లో భాగంగా ఈ రైలును భారత్లోనే డిజైన్ చేసి, ఉత్పత్తి చేశారు. వందేభారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఈ రైలు సామర్థ్యం మొత్తం 823 మంది ప్యాసింజెర్లు. సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించగలదు. అత్యాధునిక కవచ్ ఫీచర్తో రైలును నిర్మించారు. దీంట్లో స్మార్ట్కంట్రోల్స్, సేఫ్ట్ సిస్టమ్స్ ఉన్నాయి.
నిద్రపోయేందుకు అనువైన రీతిలో బెర్తులను డిజైన్ చేశారు. రాత్రి పూట ప్రయాణానికి తగినట్లుగా ఆ బెర్తుల డిజైన్ ఉన్నది. అప్పర్ బెర్తులకు వెళ్లే వారి కోసం యూజర్ ఫ్రెండ్లీ నిచ్చెనలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా సులువుగా వాడుకునే రీతిలో శౌచాలయాలు ఉన్నాయి. అడ్వాన్స్డ్ సేఫ్ట్ ఫీచర్లలో భాగంగా సీసీ కెమెరాలను కూడా ట్రైన్లో పొందుపరిచారు. స్మార్ట్ ఆటోమెటిక్ స్మూత్ డోర్లు ఉన్నాయి.
Prime Minister Narendra Modi will today flag off India’s first Vande Bharat Sleeper Train on the Howrah–Guwahati route, reducing travel time to just 14 hours. The fully air-conditioned service promises airline-like comfort, enhanced safety, and faster long-distance connectivity,… pic.twitter.com/5m7RZyYXN0
— DD News (@DDNewslive) January 17, 2026