WHO | భారత్ మరో అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక స్థానం..!
WHO | భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సమీకరించి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
WHO | భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సమీకరించి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఆయుష్ వైద్య విధానాల వివరాలను కూడా ఏఐతో ఇండియా సమీకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ‘మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్’ అనే శీర్షికలో ఈ రంగంలో ఏఐ ద్వారా విజయవంతమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించామని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
భారత్ ప్రాచీన వైద్య పద్ధతులను ‘ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ (TKDL) ద్వారా డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చిన తొలి దేశం నిలిచింది. ఆయుర్వేదం, సిద్ధ, యునాని, సోవా రిగ్పా, హోమియోపతి తదితర వైద్య విధానాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఈ డిజిటల్ లైబ్రరీలో సేకరించి, ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ వైద్య నిపుణులకు అందుబాటులో ఉంచింది. ఈ సమాచారాన్ని అర్థవంతంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఏఐ టూల్స్ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనపై భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలతో పాటు ప్రాచీన వైద్య విధానాల సమాచారాన్ని భావితరాలకు చేరే దిశలో భారత్ అగ్రగామిగా నిలవాలనే ప్రభుత్వ సంకల్పమని పేర్కొంది. ఆయుష్ జీనోమిక్స్ అనే కాన్సెప్ట్ను డబ్ల్యూహెచ్ఓ కొనియాడింది. ఇది ఆయుర్వేద సిద్ధాంతాలను జీనోమిక్స్తో మిళితం చేసే శాస్త్రీయ ప్రయోగం.
సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు భారత్, ఆయుర్వేదం, హోమియోపతి, సోవా రిగ్పా వంటి వైద్య విధానాల పరిశీలనలో మౌలికమైన టెక్నాలజీని ప్రవేశపెడుతున్నది ఈ టెక్నాలజీ, వాస్తవంలో, రసాయన సెన్సార్ల అభివృద్ధి చేయడం, ఆయుష్ ఔషధాల పనితీరు మరియు జన్యువులపై వాటి ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడనున్నది. 2018లో ప్రారంభించిన సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక అయిన ఆయుష్ గ్రిడ్ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

