Ukrainian drone attack on Russia | రష్యాపై భారీ డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారతీయ కార్మికుడితో సహా నలుగురు మృతి
Ukrainian drone attack on Russia | భారీ సంఖ్యలోని డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. భారతీయ కార్మికుడితో సహా నలుగురు మరణించారు. మరో ముగ్గురు భారతీయ కార్మికులు, మరి కొందరు గాయపడ్డారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.
మాస్కో: భారీ సంఖ్యలోని డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. భారతీయ కార్మికుడితో సహా నలుగురు మరణించారు. మరో ముగ్గురు భారతీయ కార్మికులు, మరి కొందరు గాయపడ్డారు. (Ukrainian drone attack on Russia) రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడి జరిగిన ప్రదేశాన్ని అధికారులు సందర్శించారని, గాయపడిన కార్మికులను ఆసుపత్రిలో పరామర్శించినట్లు తెలిపింది. ‘ప్రాణనష్టం పట్ల రాయబార కార్యాలయం సంతాపం వ్యక్తం చేస్తోంది. భారతీయ కార్మికులకు అవసరమైన సహాయం అందించడానికి కంపెనీ యాజమాన్యం, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోంది’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.
కాగా, ఆదివారం తెల్లవారుజామున రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు ఉక్రెయిన్ పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోలోని కొన్ని ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఉక్రేనియన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు రాజధాని వైపు దూసుకొచ్చిన సుమారు 81 డ్రోన్లను వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఈ దాడుల వల్ల పలు ప్రాంతాల్లోని నివాస భవనాలు, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. నలుగురు మరణించారని, వీరిలో ముగ్గురు మాస్కో ప్రాంతానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంలో మరో మరణం నమోదైనట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

