Indian Railways | స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే.. కొందరు అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చెత్తనంతా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. తాజాగా ఓ రైల్వే (Indian Railways) ఉద్యోగి కదులుతున్న రైలు నుంచి చెత్తనంతా పట్టాలపై పడేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
This is such an Inspiring Act to make India Clean & Beautiful..#SwachhBharat#IndianRailways
— मुंबई Matters™👁️🗨️ (@mumbaimatterz) March 6, 2025
49 సెకండ్ల నిడివిగల ఆ వీడియోలో ఓ రైల్వే ఉద్యోగి రైల్లోని చెత్తనంతా పట్టాలపై పడేస్తూ కనిపించారు. రైల్లోని డస్ట్‌బిన్‌లో ఉన్న చెత్తనంతా డోర్లో నుంచి ట్రాక్‌పైకి పడేశాడు. అతను ఓ సీనియర్ ఉద్యోగిలా తెలుస్తోంది. రైల్లో ఉన్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందించింది. భారతీయ రైల్వేలో చెత్త పారేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉందని తెలిపింది. నిబంధనలను ఉల్లఘించిన ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది. అతడికి భారీ పెనాల్టీ కూడా విధించినట్లు తెలిపింది.
There is a well settled mechanism for garbage disposal in our Indian Railways. OBHS staff which had violated the same, has been removed and heavy penalty has been imposed. Further, the staff is being counselled to ensure proper cleanliness of the trains and railway premises.
— RailwaySeva (@RailwaySeva) March 6, 2025
Also Read..
Death Sentence | హత్య కేసు.. యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష
Tejasvi Surya | ప్రముఖ గాయనితో ఎంపీ తేజస్వి సూర్య వివాహం.. ఫొటోలు వైరల్
Mystery disease | ఛత్తీస్‌గఢ్‌లో కలకలం.. అంతుచిక్కని వ్యాధితో 13 మంది మృతి