Tejasvi Surya | దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య (Tejasvi Surya) ఓ ఇంటివాడు అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ ( Singer Sivasri Skanda prasad)ను మనువాడారు. వీరి వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, పలువురు నేతలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025
శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -2లో కన్నడ వర్షన్లో శివశ్రీ ఓ పాట ఆలపించారు. ఆమె యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
ಬಿಜೆಪಿ ಯುವ ಮೋರ್ಚಾ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಸಂಸದರಾದ ಶ್ರೀ ತೇಜಸ್ವೀ ಸೂರ್ಯ ಅವರ ವಿವಾಹ ಸಮಾರಂಭದಲ್ಲಿ ನಮ್ಮ ಶಾಸಕರು ಹಾಗೂ ಮುಖಂಡರೊಂದಿಗೆ ಭಾಗವಹಿಸಿ ಶುಭಕೋರಲಾಯಿತು.
ಪಕ್ಷದ ನಿಷ್ಠಾವಂತ ಕಾರ್ಯಕರ್ತರಾಗಿ, ಯಶಸ್ವೀ ಸಂಘಟಕರಾಗಿ ಕರ್ನಾಟಕವನ್ನು ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿನಿಧಿಸುತ್ತಿರುವ ಶ್ರೀ… pic.twitter.com/WbLwunvFW6
— Vijayendra Yediyurappa (@BYVijayendra) March 6, 2025
ఇక తేజస్వి సూర్య వృత్తి రీత్యా లాయర్. కానీ ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2024 ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 3.31 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. తేజస్వి చేతిలో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ఓడిపోయారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಸಂಸದರಾದ ಶ್ರೀ ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ಅವರ ವಿವಾಹ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಧರ್ಮಪತ್ನಿ ಶ್ರೀಮತಿ ಶೈಲಜಾ ಸೋಮಣ್ಣ ಅವರೊಂದಿಗೆ ಪಾಲ್ಗೊಂಡು ಶುಭಕೋರಲಾಯಿತು.
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಬ್ಲಿಕ್ ಟಿವಿ ಮುಖ್ಯಸ್ಥರಾದ ಶ್ರೀ ಹೆಚ್.ಆರ್.ರಂಗನಾಥ್ ಅವರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು.
Attended the wedding ceremony of Bengaluru South… pic.twitter.com/qFdrdDSYOn
— V. Somanna (@VSOMANNA_BJP) March 6, 2025
Also Read..
Mystery disease | ఛత్తీస్‌గఢ్‌లో కలకలం.. అంతుచిక్కని వ్యాధితో 13 మంది మృతి
Supreme Court | సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధిపై కొత్త కేసులు నమోదు చేయొద్దన్న సుప్రీంకోర్టు