S Jaishankar | రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తున్నాం.. జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై భారత్ స్పందన
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) లండన్ (London) పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం (security breach) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత్ తాజాగా స్పందించింది.
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) లండన్ (London) పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం (security breach) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై ఖలిస్థానీ సానుభూతిపరులు (Khalistani extremists) దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. ఈ అంశంపై భారత్ తాజాగా స్పందించింది. భద్రతాలోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తూ.. గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన ఫుటేజీని మేం చూశాము. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.
కాగా, జై శంకర్ ఈనెల 4న యూకే పర్యటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పర్యటనలో భాగంగా 9వ తేదీ వరకూ అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పలు సమావేశాలకు హాజరవుతున్నారు. బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్ హౌస్ (Chatham House)లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో కొందరు ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్, కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి భారత జెండాను (tear Indian flag) చేత పట్టి మంత్రి కారుకు అత్యంత సమీపంలోకి దూసుకొచ్చాడు. జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | London, UK | Pro-Khalistan supporters staged a protest outside the venue where EAM Dr S Jaishankar participated in a discussion held by Chatham House pic.twitter.com/ISVMZa3DdT
— ANI (@ANI) March 6, 2025
Also Read..
S Jaishankar | జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కేంద్ర మంత్రిపై దాడికి ఖలిస్థానీల యత్నం
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Donald Trump | ఇదే మీకు చివరి హెచ్చరిక.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

