రష్యాలో తయారైన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమల్ భారత నౌకాదళంలోకి చేరింది. కాలినన్గ్రాడ్లో మంగళవారం అది జల ప్రవేశం చేసింది. 125 మీటర్ల పొడవు, 3,900 టన్నుల బరువున్న ఈ యుద్ధ నౌక భారతీయ, రష్యన్ అత్యాధునిక సాంకేతికతల మిశ్రమంగా అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు యుద్ధ నౌక ‘ఉదయ్గిరి’ కూడా మంగళవారం ముంబైలో నౌకాదళంలో చేరింది. ప్రాజెక్ట్ 17ఏ కింద తయారైన స్టెల్త్ టెక్నాలజీ యుద్ధ నౌకల్లో ‘ఉదయ్గిరి’ రెండోది అని అధికారులు తెలిపారు.