న్యూఢిల్లీ, ఆగస్టు 31: లావోస్‌లో ‘నకిలీ ఉద్యోగ అవకాశాల’ పట్ల అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత ఎంబసీ అధికారులు మనదేశ పౌరులను హెచ్చరిస్తున్నారు. బోకియో ప్రావిన్స్‌లో 47 మంది భారతీయుల్ని కాపాడి, స్వదేశానికి పంపామని ఎంబసీ అధికారులు శనివారం ప్రకటించారు.
ఇప్పటివరకు 635 మంది భారతీయుల్ని రక్షించినట్టు చెప్పారు. ఫేక్ జాబ్ ఆఫర్లను నమ్మి, లావోస్ వస్తున్న అనేకమంది భారతీయులు సైబర్ బానిసలుగా పనిచేయాల్సి వస్తున్నది. రోజువారీ టార్గెట్‌ను చేరుకోకపోతే వారు ఆహారం, విశ్రాంతి కోల్పోవాల్సి వస్తున్నది.