Indian Army : చైనాపై మరింత నిఘా.. డ్రోన్లను ఆర్డరిచ్చిన సైన్యం
Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.

Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది. 2021 లో హై ఎలిట్యూడ్ టాక్టికల్ డ్రోన్ల పనితీరును గమనించిన తర్వాత, చైనాపై మరింత నిఘా పెంచేందుకు మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత సైన్యం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి భారత్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఈ డ్రోన్లున్నాయని, అందుకే వీటిని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గత రెండేళ్లుగా భారత, చైనా మధ్య సరిహద్దు విభేదాలు కొనసాగుతున్న విషయం విదితమే. ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలోనే ఈ డ్రోన్లను విరివిగా ఉపయోగంలోకి తీసుకురావాలని భారత సైన్యం భావిస్తోంది.
ఇప్పటికే మానవ రహిత విమానాలు, ఉప గ్రహాలు, పీ8ఐ వంటి ప్రత్యేక విమానాలతో సరిహద్దు ప్రాంతల్లో భారత సైన్యం నిఘా వుంచుతోంది. వీటికి తోడుగా ఈ డ్రోన్లను కూడా మరింత ఎక్కువ స్థాయిలో అందుబాటులోకి తెచ్చి, చైనాపై ఓ నిఘా ఉంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్ని డ్రోన్లను ఆర్డర్ ఇచ్చారు, వీటి ఖరీదు ఎంత ? అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. అయితే ఐడియోఫోర్జ్ అధినేత మాత్రం ఈ డ్రోన్ల కొనుగోలును ధృవీకరించారు.
ఈ స్విచ్డ్రోన్ల బరువు 6.5 కిలోలు వుంటుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. హెలికాప్టర్ లాగా నిలువుగా టేకాఫ్ చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత, బలమైన గాలులు వున్నా సరే, ఎక్కువ ఎత్తులో ఇవి ఎగిరే సామర్థ్యాన్ని కలిగి వుంటాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాదాపు 2 గంటల పాటు ఈ డ్రోన్లు ఎగరగలుగుతాయి. 15 కిలోమీటర్ల మేర ఎక్కడైనా సరే పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

