మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 17:32:52

మోదీజీ ప్లీజ్‌.. జ‌పాన్ నౌక‌లోని భార‌తీయుల ఆక్రందన‌

మోదీజీ ప్లీజ్‌.. జ‌పాన్ నౌక‌లోని భార‌తీయుల ఆక్రందన‌

హైద‌రాబాద్‌:  జ‌పాన్ స‌ముద్ర‌జ‌లాల్లోని యోకొహ‌మా స‌మీపంలో నిలిచి ఉన్న డైమండ్ ఎక్స్‌ప్రెస్ నౌక‌లో భార‌తీయులు ఉన్న విష‌యం తెలిసిందే.  క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు ఆ నౌక‌లో ఉన్నందున  ఆ నౌక‌ను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయిదుగురు భార‌తీయ సిబ్బంది.. ఇవాళ వీడియో ద్వారా ఓ మెసేజ్ పంపారు.  కిచ‌న్ స్టాఫ్‌గా ప‌నిచేస్తున్న వారు.. త‌మ‌ను ఆదుకోవాలంటూ వేడుకున్నారు.  బెంగాల్‌కు చెందిన బిన‌య్ కుమార్ స‌ర్కార్ ఆ వీడియోలో చేతులు జోడించి త‌మ‌ను ర‌క్షించాలంటూ కోరారు.  షిప్‌లో మొత్తం 3700 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.  హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ ప్ర‌యాణికుడు మొద‌ట క‌రోనా  ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలాడు. అయితే ఆ షిప్‌లో మొత్తం 160 మంది భార‌తీయులు ఉన్నారు.  ఎవ‌రూ త‌మ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చెక్ చేయ‌లేద‌ని,  మ‌మ్ముల్ని విడిపించండి అంటూ భార‌తీయ‌ సిబ్బంది  ప్ర‌ధాని మోదీతో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితిని అభ్య‌ర్థించారు. షిప్‌లో ఉన్న సుమారు 130 మందికి కరోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. అయితే వ‌ర‌ల్డ్ డ్రీమ్ అనే మ‌రో నౌక‌లో ఉన్న సిబ్బంది, ప్ర‌యాణికులు మాత్రం ఇటీవ‌ల విడుద‌ల చేశారు.

 logo