న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : భారత్కు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఆక్సియమ్-4 మిషన్లో భాగంగా ఆయన వచ్చేనెల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనించనున్నారు. భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం తెలిపారు. ‘గ్రూప్ కెప్టెన్ శుక్లా ప్రయాణం కేవలం విమాన ప్రయాణం కాదు. అంతరిక్ష పరిశోధనల్లో కొత్త యుగంలోకి భారత్ ధైర్యంగా అడుగుపెడుతుందనడానికి ఇది సంకేతం’ అని అన్నారు.