Indian Army | ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు ప్రయోగించింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్‌ను విరోచితంగా కూల్చివేసింది. అలాగే రాజస్థాన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూడా కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రెండు జేఎఫ్17 యుద్ధ విమానాలను సైతం కూల్చివేసిందని సమాచారం.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో భారత సైన్యం అప్రమత్తం చేసింది. ప్రజలంతా తమ నివాసాల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. అఖ్నూర్, కిశ్వార్, సాంబా సెక్టార్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలివేశారు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు.