న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Army chief Gen Upendra Dwivedi) ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇటీవల లెబనాన్‌లో పేజర్లు పేలిన విషయం తెలిసిందే. అయితే ఆ పేజర్లను బాంబులుగా మార్చింది ఇజ్రాయిల్. మరి ఇలాంటి ఘటనలో ఇండియా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న ప్రశ్నకు జనరల్ ద్వివేది సమాధానం ఇచ్చారు. ఆ పేజర్లు తైవాన్ కంపెనీకి చెందినవని, కానీ వాటిని హంగేరీ కంపెనీకి సరఫరా చేశారని, హంగేరి కంపెనీ వాటిని లెబనాన్‌కు పంపిందన్నారు.
ఇజ్రాయిలీలు ఓ షెల్ కంపెనీని క్రియేట్ చేసి.. హిజ్బొల్లాకు మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దీని కోసం ఎన్నో ఏండ్ల ప్రణాళిక అవసరం అని, అంటే ఆ దేశం ఆ ప్లాన్ ఎప్పుడో వేసిందన్నారు. మనం పోరాడుతున్న తీరుతో యుద్ధం ప్రారంభం కాదు అని, మనం ప్లానింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే యుద్ధం మొదలైనట్లు అవుతుందని ఆర్మీ చీఫ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. ఇదే చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. ఇక మన దేశం గురించి ఆలోచిస్తే, సప్లయ్ చెయిన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. టెక్నిల్ స్థాయిలో అయినా లేక మాన్యువల్ స్థాయిలో అయినా కచ్చితంగా వేర్వేరు స్థాయిల్లో పర్యవేక్షణ ఉండాలన్నారు.
#WATCH | On Israel turned pagers into bombs and what India is doing to tackle such issues, Indian Army chief Gen Upendra Dwivedi says, “…The pager that you’re talking about, it’s a Taiwan company being supplied to a Hungarian company. Hungarian company thereafter giving it to… pic.twitter.com/O7KzqA1cD1
— ANI (@ANI) October 1, 2024
అమర్నాథ్ యాత్రలో ఈసారి భక్తుల సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిందని, జమ్మూకశ్మీర్‌కు రెండు కోట్ల మంది టూరిస్టులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం ఇద్దరు ఉగ్రవాదులను మాత్రమే రిక్రూట్ చేశారని, గతంలో ఈ సంఖ్య 300 వరకు ఉండేదన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే, శాంతి, సామరస్యం దిశగా మనం వెళ్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఉగ్రవాదులు ఎక్కువ శాతం విదేశీయులే ఉన్నారని, సెక్యూర్టీ దళాలను పునరుత్తే చేశామన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆ రాష్ట్రం నిలకడగా ఉంటుందన్నారు.