Anti Tank Missile | యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో..!
Anti Tank Missile | భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లో శనివారం యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థని నిర్వహించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన ఈ క్షిపణి వ్యవస్థను ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉన్నది.
Anti Tank Missile | భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లో శనివారం యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థని నిర్వహించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన ఈ క్షిపణి వ్యవస్థను ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉన్నది.
దీంతో సైన్యంలోకి యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను చేర్చడానికి మార్గం సుగమమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈ వెపన్ సిస్టమ్‌ను రూపొందించిందని అధికారులు తెలిపారు. ఇందులో ఎంపీఏటీజీఎం, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ ఎక్విప్మెంట్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్డీవో, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఆధునిక సాంకేతిక ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో స్వావలంబన సాధించే దిశగా ఇది ఓ కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు.
ఎంపీఏటీజీ ఆయుధ వ్యవస్థను పలుమార్లు మదింపు చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఈ ఆయుధ వ్యవస్థను శనివారం పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది. మిస్సైల్ సిస్టమ్ అద్భుతమైన పనితీరును పరీక్షించిందని తెలిపింది. ఈ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను పగలు, రాత్రి సమయాల్లోనూ వినియోగించవచ్చని చెప్పింది. ఈ మిస్సైల్ ప్రయోగంలో పాల్గొన్న సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

