న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి భారత్ తలవంచబోదన్నారు. తమ కార్యకలాపాలతో ఉగ్రవాదులు సక్సెస్ సాధించబోరన్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ.. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్లో సుమారు 26 మంది అమాయక పర్యాటకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. పెహల్గాం ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరిస్తున్నానని, గత ఏడాది ఇదే రోజున ఆ ఘటన జరిగిందని, వాళ్లను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధాని అన్నారు.
తన ఎక్స్‌లో ఆయన రియాక్ట్ అయ్యారు. ఉగ్రవాద బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఓ దేశంగా కష్ట సమయంలో కలిసికట్టుగా ఉంటామని, భారత్ ఎటవంటి ఉగ్ర బెదిరింపులకు లొంగదని, ఉగ్రవాదుల కపట మోసాలు ఎన్నటికీ నిలవలేవన్నారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత.. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌పై భారత్ సైనికచర్య చేపట్టింది. పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026