తమ్లుక్: ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో భాగస్వామినవుతానని, అందులో కొనసాగుతానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇండియా కూటమికి కేంద్రంలో తాను బయట నుంచి మద్దతు ఇస్తానని బుధవారం చేసిన ప్రకటనపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమి అన్నది తన మెదడులో పుట్టిన ఆలోచన అని, తామంతా జాతీయ స్థాయిలో కలిసి కొనసాగుతామని అన్నారు. మమత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కొట్టి వేశారు. ఆమె మాటలను విశ్వసించనన్నారు.