Army Chief | గతేడాది పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో దాయాది ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నించినట్లైతే సాయుధ దళాలు భూ దాడులను (ground offensive) ప్రారంభించేందుకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను కచ్చితత్వంతో అమలు చేసినట్లు చెప్పారు. 88 గంటల పాటూ సాగిన ఈ ఆపరేషన్‌లో సైనిక దళాలు సమర్థంగా పనిచేశాయన్నారు. దాయాది ఏదైనా తప్పు చేస్తే.. భూ కార్యకలాపాలను ప్రారంభించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు నాటి పరిస్థితులను ఆయన వివరించారు.
రాకెట్ మిస్సైల్ దళాన్ని (Rocket Missile Force) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. రాకెట్లు, మిస్సైళ్ల నేటి రోజుల్లో అత్యవసరంగా మారాయని, శత్రు దేశాలపై ఏదైనా ప్రభావం చూపాలంటే ఆ రెండు కీలకంగా మారినట్లు ఆయన చెప్పారు. రాకెట్ మిసైల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
Also Read..
Delhi | చలితో ఢిల్లీ గజగజ.. ఈ సీజన్లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు.. ఐఎండీ కీలక హెచ్చరికలు
Trump Tariffs | ఇరాన్ ట్రేడింగ్‌పై ట్రంప్ టారిఫ్ బాదుడు.. భారత్‌పై మరో 25 శాతం సుంకం తప్పదా?
Ayatollah Ali Khamenei | మోసపూరిత చర్యలను ఆపండి.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్