Delhi | ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఈ సీజన్లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి.
మంగళవారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ట ఉష్ణోగ్రత కూడా. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం కూడా తీవ్రంగానే ఉన్నది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్స్ వెరీ పూర్ కేటగిరీ (337)గా నమోదయ్యాయి.
Also Read..
Viral Video | ఆవుపై చిరుత దాడి.. తర్వాత ఏం జరిగిందో చూడండి.. షాకింగ్ వీడియో
Earthquake: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత
Trump Tariffs | ఇరాన్ ట్రేడింగ్‌పై ట్రంప్ టారిఫ్ బాదుడు.. భారత్‌పై మరో 25 శాతం సుంకం తప్పదా?