న్యూఢిల్లీ: సహకార యాజమాన్య నమూనాలో కేంద్రం సహకారంతో అమలవుతున్న భారత్ ట్యాక్సీ సేవలు గురువారం మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ సేవలను న్యూఢిల్లీలో ప్రారంభించారు.
ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సహకార వ్యవస్థలో ప్రయాణికులు చెల్లించిన చార్జీలను పూర్తిగా డ్రైవర్లే పొందవచ్చు. ప్రైవేట్ క్యాబ్ సర్వీసులతో పోలిస్తే భారత్ ట్యాక్సీలో చార్జీలు 30 శాతం తక్కువగా ఉంటాయి. రెండేండ్లలో దేశ వ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.