India-Pak | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇస్లామాబాద్‌కు (Pakistan) షాకులమీద షాకులిస్తోంది. దాయాది దేశంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే పలు ఒప్పందాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా పాక్‌పై పలు కఠిన ఆంక్షలను విధిస్తోంది.
తాజాగా పాక్ నుంచి వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీని నిలిపివేస్తూ (suspends exchange of mail parcel services) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్శిళ్లపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించిందిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ షిప్‌లను నిషేధించిన భారత్
పాకిస్థాన్ షిప్‌లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్రవేశించడాన్ని భారత్ నిషేధించింది. ) పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘పాకిస్థాన్ జెండా కలిగిన ఓడలు భారతదేశంలోని ఏ పోర్టులోకి ప్రవేశించడానికి అనుమతించబోం. అలాగే భారతీయ షిప్‌లు పాకిస్థాన్‌లోని ఏ పోర్టును సందర్శించకూడదు’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
జాతీయ భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘భారతీయ ఆస్తుల భద్రత, సరుకు రవాణా, అనుసంధాన మౌలిక సదుపాయాల ప్రయోజనాల కోసం, భారత షిప్పింగ్ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ చర్య తీసుకున్నాం’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది. అదేవిధంగా తమ షిప్‌లు కూడా పాక్ జలాలు, పోర్టులవైపు వెళ్లొద్దని సూచించింది.
Also Read..
Pakistan Ships Banned | పాకిస్థాన్ షిప్‌లను నిషేధించిన భారత్.. పోర్టుల్లోకి అనుమతి నిరాకరణ
Pahalgam attack | పాక్‌కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం