India Passport | ప్రపంచంలోనే 2024కి గానూ అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిఉన్న దేశాల జాబితాను (most powerful passports ranking) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ( Henley Passport Index) అనే సంస్థ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా 199 దేశాల పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారత్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారడం గమనార్హం (India Passport).
గతేడాది ఈ ర్యాంకింగ్స్‌లో మన దేశం 84వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ఒకస్థానం దిగజారి 85కి పడిపోయింది. మన దేశ పాస్‌పోర్ట్ ఉన్న వారు 62 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. ఇక ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ , సింగపూర్, స్పెయిన్ దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. ఆ దేశాల పాస్‌పోర్టులు ఉంటే 194 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు.
ఈ జాబితాలో పొరుగుదేశం పాకిస్థాన్ గతేడాదిలానే 106వ స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ 101వ స్థానం నుంచి 102వ స్థానానికి దిగజారింది. ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్ కూడా బలమైన పాస్‌పోర్ట్‌తో 58వ స్థానంలో కొనసాగుతోంది. మాల్దీవుల పాస్‌పోర్ట్ ఉన్న వాళ్లు 96 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం సాగించొచ్చు.
Also Read..
Plane Villa | ఫ్లైట్‌ను లగ్జరీ విల్లాగా మార్చిన వ్యక్తి.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. VIDEO
Yodha Movie | విమానం హైజాక్ కథాంశంతో ‘యోధ’.. ఇంట్రెస్టింగ్గా టీజర్
Sudden cardiac arrest | కార్డియాక్ అరెస్ట్ ముప్పు తప్పాలంటే వీటిని పాటిస్తే మేలు..!