Sudden cardiac arrest | కార్డియాక్ అరెస్ట్ ముప్పు తప్పాలంటే వీటిని పాటిస్తే మేలు..!
Sudden cardiac arrest : ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గుండె జబ్బులు లేనివారిలోనూ లక్షణాలు బయటపడిన గంటలోపే సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
Sudden cardiac arrest : ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గుండె జబ్బులు లేనివారిలోనూ లక్షణాలు బయటపడిన గంటలోపే సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన వారు క్షణాల్లోనే కుప్పకూలి మృత్యువాతన పడుతుండటం కలకలం రేపుతోంది. గుండె లయ దెబ్బతినడంతో గుండె పనిచేయని పరిస్ధితి తలెత్తి కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తున్న కేసులు వెలుగుచూస్తున్నాయి.
యువతలోనూ సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న యువ హృదయాలు తల్లడిల్లుతున్నాయి. గుండె లయ తప్పడంతో శ్వాస ఆగిపోవడంతో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఘటనలు నమోదవుతున్నాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వారిలో 80 శాతం కేసులు వెలుగుచూస్తున్నాయని, యాంజియోగ్రాఫీ చేయిస్తే వీరిలో బ్లాక్స్ పేరుకుపోవడం కనిపిస్తుందని మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ ప్రిన్సిపల్ డైరెక్టర్, కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
యువతలో సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరగడంతో వీటి ముప్పును, నివారించే చర్యల గురించి అవగాహన పెంచుకోవడం కీలకమని డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు. హృద్రోగ ముప్పునకు కరోనరీ ఆర్టరీ డిసీజ్ ముప్పు కారకాల్లో ప్రధానమైన బీపీని అదుపులో ఉంచుకోవాలి, ధూమపానం మానేయడం, మధుమేహ నియంత్రణ, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంతో పాటు శారీరకంగా చురుకుగా ఉండాలని డాక్టర్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. వీటితో పాటు శరీరానికి అవసరమైనంత పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 20 ఏండ్లు దాటిన వారంతా తరచూ ఈసీజీతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
Read More :
Deepika Padukone | బాఫ్టా అవార్డుల వేడుకలో మెరిసిన దీపికా పదుకొణె.. వీడియో వైరల్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

