న్యూఢిల్లీ: అణు దేశాలపై పాక్, చైనా నుంచి ముప్ప పొంచిన వేళ మన దేశం సుదీర్ఘ యుద్ధాలకు సిద్ధంగా ఉండాలని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఐఐటీ బాంబేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు మనకు ముఖ్య సవాళ్లని తెలిపారు.
‘గతంలో నిర్వహించిన ఆపరేషన్ల మాదిరిగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్వల్ప, దీర్ఘ కాలిక ఘర్షణలకు సిద్ధపడాలి. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, రోబోటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ పోరాట తీరును మార్చేస్తున్నాయి’ అని ఆయన అన్నారు.