భారత్ ఉదారత.. ఆఫ్ఘన్‌కు 5లక్షల డోసుల కొవాగ్జిన్ కొవిడ్ టీకాలు
Covaxin Vaccine | తాలిబన్ల పాలన మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పేదరికం, ఆకలి, నిరుదోగ్యం భారీగా పెరిగింది. ఈ క్రమంలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడం కష్టతరంగా

న్యూఢిల్లీ : తాలిబన్ల పాలన మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పేదరికం, ఆకలి, నిరుదోగ్యం భారీగా పెరిగింది. ఈ క్రమంలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడం కష్టతరంగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్ఘన్ ప్రజలకు మరోసారి సహాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి భారతదేశం 5లక్షల కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ మోతాదులను విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే కొద్ది వారాల్లో, ఐదు లక్షల డోసుల కొవాగ్జిన్ టీకాలను పంపనున్నట్లు పేర్కొంది. ఇవే కాకుండా ఆఫ్ఘన్ ప్రజలను ఆకలి నుంచి రక్షించేందుకు ఆహార ధాన్యాలు, ప్రాణాలను రక్షించే మందులను సైతం భారత్ పంపింది. ఆఫ్ఘనిస్తాన్‌కు 1.6 టన్నుల వైద్య సహాయాన్ని పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ సహాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా భారత్ అందజేసింది.
#WATCH | India has supplied the next batch of humanitarian assistance consisting of 500,000 doses of COVID-19 vaccine, Covaxin to Afghanistan. pic.twitter.com/agzcqitRqf
— ANI (@ANI) January 1, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

