JN.1 | దేశంలో 682కు పెరిగిన జేఎన్.1 కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్యధికం
JN.1 | భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోవారం వెల్లడించాయి.
JN.1 | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) కారణంగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. నెలన్నరలోనే ఈ కొత్త వేరియంట్ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. అమెరికా సహా సింగపూర్ తదితర దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇక భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోవారం వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపాయి.
కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 139, గోవాలో 47, గుజరాత్లో 36, ఆంధ్రప్రదేశ్లో 30, రాజస్థాన్లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, ఒడిశాలో మూడు, తెలంగాణలో రెండు, హర్యానాలో ఒక కేసు నమోదైంది.
ఈ కొత్త వేరియంట్ కారణంగా కొవిడ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే, అదే సమయంలో రోజూవారీ కేసులకు సమానంగా కోలుకుంటున్న వారి సంఖ్య ఉండటం ఊరటనిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) సోమవారం వెల్లడించింది. నిన్న 648 మంది కోలుకున్నారు. దీంతో మహమ్మారి నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 44,481,341కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,002 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే నాలుగు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Also Read..
Coronavirus | 24 గంటల్లో 600కు పైనే కొత్త కేసులు.. నాలుగు మరణాలు
Elon Musk | డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏమన్నారంటే
Ayodhya Ram Mandir | రాత్రి సమయంలో రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలు షేర్ చేసిన ట్రస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

