న్యూఢిల్లీ, జూన్ 8: దేశంలో కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గడచిన 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో మరో ఆరు మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది.
కేరళలో అత్యధిక కేసులు నమోదు కాగా తర్వాతి స్థానంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. దీంతో వైద్య సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేసేందుకు కేంద్ర మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అన్ని దవాఖానాలలో ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, ఇతరఅత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ర్టాలను ఆదేశించింది.