న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Corona) కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 1761 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మూడో దశ ప్రారంభమైన తర్వాత రెండు వేలలోపు రోజువారీ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,07,841కి పెరిగింది. ఇందులో 4,24,65,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,479 మంది బాధితులు మృతిచెందగా, 26,240 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 127 మంది మహమ్మారికి బలవగా, 3196 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.